బాహుబలిలో అనుష్క డూపుగా నటించింది ఈ హీరోయినా..?

బాహుబ‌లి(Baahubali).. తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పిన సినిమా ఇది. బాహుబలి:ద బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్ టైటిల్స్ తో రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివరించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇందులో ప్ర‌భాస్ హీరోగా, రానా విల‌న్ గా న‌టిస్తే.. అనుష్క శెట్టి, త‌మ‌న్నా హీరోయిన్లుగా చేశారు.

రమ్య కృష్ణ, నాజ‌ర్‌, సత్యరాజ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి(Rajamouli) దాదాపు ఐదేళ్ల పాటు చెక్కిన ఈ చిత్రం అనేక రికార్డుల‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో దేవసేన పాత్ర‌లో అనుష్క ఎంత‌లా ఆక‌ట్టుకుంటో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌భాస్ కు భార్య‌కు, త‌ల్లిగా రెండు పాత్ర‌ల‌ను పోషించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

అయితే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె కూడా ఓ హీరోయిన్.. ఈ అమ్మడు చూడటానికి అచ్చం అనుష్క లానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. అదే హైట్ , అదే కలర్ తో ఉంటారు. ఇంతకు అమ్మడు ఎవరు అంటే.. రుషిక రాజ్. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మడు.

ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది రుషిక రాజ్. అనుష్కకు డూప్ గానే కాదు. బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది ఈ చిన్నది.

Share this Article
Leave a comment