విశాఖపట్నం: పద్మనాభం మండలం & గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కుంతీ మాధవ స్వామి (Kunthi Madhava Swamy Temple Padmanabham) ఆలయంలో నేటి (బుధవారం) నుంచి అనంత పద్మనాభ స్వామి వారి పవిత్రోత్సవములు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా…
- నేడు 8వ తేదీ బుధవారం సాయంత్రం 6 గం.లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ముత్సంగ్రహణ, అంకురారోపణ, తీర్ధప్రసాద వితరణ
- 9వ తేదీ గురువారం ఉదయం గం. 7-30 ని. లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం… పంచగవ్య ప్రాతం, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్టాపన, పీతాగ్ని ప్రణయనం, నిత్య హోమాలు, తీర్ధ ప్రసాద వితరణ. సాయంత్రం గం. 6-30 ని. లకు నిత్యహోమాలు, స్వామి వారి మూలమంత్ర హోమం, పవిత్రాలు అభిమంతరణ, మహాశాంతి హోమం, తీర్ధ ప్రసాద వితరణ.
- 10వ తేదీ శుక్రవారం ఉదయం 7 గం.లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, 8 గం. లకు మాధవస్వామి, పద్మనాభస్వామికి అష్టకలశస్నపన, పంచామృతాభిషేకం, అనంతరం నిత్యహోమం, స్వామివారికి పవిత్రాల సమర్పణ, తీర్ధప్రసాద వితరణ, సాయంత్రం 6 గం లకు నిత్యహోమం, దాతాదిసామాన్య హోమం, హొత్ర ప్రశంసనం, తీర్ధప్రసాద వితరణ.
- తేది. 11-11-2023 శనివారం ఉదయం గం. 6-30 ని. లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, పవిత్ర విసర్జన. 11 గం. లకు శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.