Youngest Developers: భారతదేశంలో అత్యంత పిన్న వయసులో సీఈఓ లుగా శ్రావణ్, సంజయ్

Youngest CEOs

శ్రావణ్ మరియు సంజయ్ 8 అండ్ 10 ఏళ్ల వయసులోనే చెన్నైలోని తమ ఇంటి వద్ద Godimensions అనే కంపెనీ స్థాపించి సక్సెస్ సాధించారు

సక్సస్ స్టోరీస్: ఒక యువకుడు మరియు అతని సోదరుడు 6 మరియు 8వ తరగతి చదువుతున్నప్పుడే  భారతదేశపు అతి చిన్న వైయస్కులైన సహవ్యస్థాపకులు మరియు అతి చిన్న వయసులైన సీఈవోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు చెందిన శ్రావణ్ మరియు సంజయ్ కుమారన్ భారత దేశంలో అతి చిన్న వయసులో డెవలపర్లుగా గుర్తింపు పొందారు. కేవలం రెండేళ్ళలోనే సోదరులు ఏడు మొబైల్ యాప్‌లను సృష్టించి యంగెస్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ప్రొగ్రామర్స్‌’గా గుర్తింపు పొందారు.. ఈ యాప్‌లు 50కి పైగా దేశాలలో ప్రాచుర్యం పొందాయి మరియు వేలాది డౌన్‌లోడ్‌లను పొందాయి. ఆ ఇద్దరి సోదరులలో ప్రోగ్రామింగ్ పట్ల మక్కువను ప్రేరేపించినది వారి తండ్రి కుమరన్ సురేంద్రన్. వారు తొలినాళ్ల నుంచి కంప్యూటర్‌లపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు. నాలుగేళ్ల వయస్సులో PPTలను తయారు చేయడం ప్రారంభించారు. దీంతో సురేంద్రన్ తన ఇద్దరు కొడుకులకు చిన్నతనంలోనే ప్రోగ్రామింగ్ నేర్పించాలని నిర్ణయించుకున్నాడు.

రకరకాల పుస్తకాలు చదివి ప్రొగ్రామింగ్‌ మీద పట్టు సాధించిన కుమరన్స్‌ ‘గో వీఆర్‌’ పేరుతో సొంతంగా వర్చువల్‌ రియాలిటీ డివైజ్‌ తయారుచేశారు. మార్కెట్లో ఎన్నో వీఆర్‌ డివైజ్‌లు ఉండగా దీన్ని ఎందుకు కొనాలి? సోదరుల మాటల్లో చెప్పాలంటే వాటితో పోల్చితే ఇది కారుచౌక. కుమారన్ సోదరులు సృష్టించిన మొదటి యాప్ క్యాచ్ మీ కాప్, ఇది ప్రాథమికంగా భారతదేశంలో ప్రసిద్ధ చిన్ననాటి గేమ్ ‘చోర్-పోలీస్’ ఆధారంగా నిర్మించిన గేమింగ్ యాప్. వారు సృష్టించిన ఇతర యాప్‌లలో చైల్డ్ ఎడ్యుకేషన్ యాప్‌లు ఆల్ఫాబెట్ బోర్డ్ మరియు కలర్ పాలెట్, ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ఎమర్జెన్సీ బూత్, ప్రేయర్ యాప్ మరియు గేమింగ్ యాప్‌లు సూపర్ హీరో, కార్ రేసింగ్ ఉన్నాయి. వారు 150 టెస్ట్ యాప్‌లను కూడా అభివృద్ధి చేశారు.

సేవాతత్వానికి ఊతం ఇచ్చే ‘గో డొనేట్‌’లాంటి యాప్స్‌ని రూపొందించిన కుమరన్‌ బ్రదర్స్‌ ‘సమాజం కోసం ఏదైనా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము’ అంటున్నారు. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలో చోటు సంపాదించడంతో పాటు ఎన్నో అవార్డ్‌లు సొంతం చేసుకున్నారు. ఇద్దరు సోదరులు USలోని టెక్సాస్ A&M విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను పొందారు. శ్రవణ్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో సేల్స్‌ఫోర్స్ కోసం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తుండగా, సంజయ్ మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటర్న్ చేస్తున్నాడు.

వీరిలాగే మరెందరో..?

స్కూల్‌ వయసులోనే అర్జున్‌ సంతోష్‌ కుమార్‌ అనే యువకుడు ‘లొకెటేర’ అనే మొబైల్‌ యాప్‌ రూపొందించాడు. వాతావరణానికి అనుగుణంగా స్కూల్‌ బస్‌రూట్స్‌లో ప్లాన్, షెడ్యూల్, రీ–షెడ్యూల్‌ చేయడానికి, ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని పేరెంట్స్‌కు తెలియజేయడానికి అనువైన ఈ యాప్‌ మాసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (యంఐటీ) ‘బెస్ట్‌యాప్‌’ అవార్డ్‌ గెలుచుకున్నాడు. ‘ఎనీవన్‌ ఏఐ’ వెంచర్‌ మొదలుపెట్టిన అర్జున్‌ గూగుల్‌ వెబ్‌రేంజర్స్‌ అవార్డ్, నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సెప్షనల్‌ ఎచీవ్‌మెంట్స్‌ ఫర్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ అవార్డ్‌లు అందుకున్నాడు. చెన్నైను వరదలు చుట్టిముట్టినప్పుడు అర్జున్‌ డెవలప్‌ చేసిన ‘ఐ వాలంటీర్‌ ఫర్‌ చెన్నై’ యాప్‌ స్వచ్ఛందసంస్థలు, సేవకులకు ఎంతో ఉపయోగపడింది.

పుణెకి చెందిన పర్వీందర్‌సింగ్‌ ‘ప్రోసింగ్‌’గా 13 ఏళ్ల వయసులోనే టెక్‌ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ‘మనీ రివార్డ్‌’ అనే తొలి యాప్‌ను లాంచ్‌ చేసి.. తమ మొబైల్స్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి టీనేజర్స్‌కు ఉపయోగపడే యాప్‌ తాయారు చేసాడు. 16 సంవత్సరాల వయసులో ‘ఇన్‌స్టా ఈజీ’ సార్టప్‌ను లాంచ్‌ చేశాడు. 17 సంవత్సరాల వయసులో ‘ది యాక్చువల్‌ గ్రోత్‌ హాక్‌–ఏ కంప్లీట్‌ గైడ్‌ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ అనే పుస్తకం రాశాడు.

వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఇంకా ఇలా ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేద్దాం.

Share this Article
1 Comment