అది చుక్క కాదు శుక్ర గ్రహం.. ఈరోజు కూడా చూడొచ్చు

strange in the sky

భారత్ షార్ట్స్: ఖగోళంలో నిన్న రెండు అరుదైన (Strange in the sky) ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘చంద్రునితో శుక్ర గ్రహణం, శుక్రునితో చంద్ర సంయోగం’ జరిగాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీరఘునందన్‌ తెలిపారు. ఇవి సూర్యాస్తమయానికి ముందే జరగడంతో మనకు కనిపించలేదు. ఈ శుక్రగ్రహణం సాయంత్రం 4:45 గంటలకు మొదలై 5.30 గంటలకు ముగిసింది. లద్దాక్‌లోని అన్‌లే అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రాత్రివేళ ఆకాశంలో చూసినప్పుడు మాత్రం చంద్రుడి కింది భాగంలో చుక్క కనిపించింది. అది నక్షత్రం కాదు…. శుక్రగ్రహం. ఈ రెండూ పక్కపక్కనే ఉన్నట్లు కనిపించినప్పటికీ వాస్తవానికి వాటి మధ్య 18.54 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమి నుంచి శుక్రగ్రహం 18.55 కోట్ల కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి చంద్రుడు 3,75,063 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇలాంటి వింతలు ఈ ఏడాది ఆగస్టు వరకు కనిపిస్తాయి. చంద్రుడు (moon), శుక్రుడు (veenus) దగ్గరగా రావడాన్ని శనివారం సైతం చూడవచ్చు. ఆ తర్వాత దూరంగా వెళతాయి’ అని ఎన్‌.శ్రీరఘునందన్‌ వెల్లడించారు.

Share this Article
Leave a comment