Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అర్థనగ్నంగా బికినీతో ప్రయాణించిన యువతి.. వీడియో వైరల్

Delhi Metro News

Delhi Metro: వస్త్రధారణ విషయంలో విదేశాల్లో ఎవరు ఎలా ఉన్నా.. మన దేశంలో ప్రజలు కొన్ని కట్టుబాట్లు పాటిస్తారు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు.. నిండైన వస్త్రాలు ధరిస్తారు. అందుకే మన దేశాన్ని ప్రపంచదేశాలు గౌరవిస్తాయి. అయినా బట్టలున్నది.. శరీరాన్ని కప్పుకోవడానికి గానీ.. చూపించడానికి కాదు కదా.. కానీ.. కొంతమంది ఆ సంస్కృతిని దెబ్బతీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఓ యువతి బికినీలో ప్రయాణించడం కలకలం రేపింది.

బికినీ వేసుకున్న ఆ యువతి.. అసౌకర్యంగానే రైల్లో ప్రయాణించింది. స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్‌ని శరీరానికి అడ్డుగా పెట్టుకుంది. అలాంటి డ్రెస్ వేసుకోవడమెందుకు.. ఇలా ఇబ్బంది పడటమెందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణే అయితే.. మన యంగ్ జనరేషన్ అమ్మాయిలు.. దీనికి బాధితులు అవుతున్నట్లే. సిగ్గులేని ఫెమినిస్టులు కోరుకునేది ఇదేనా? నేను దీనిని సాంస్కృతిక హననం అని పిలుస్తాను” అని ఒక నెటిజన్ ట్వీట్ చేసాడు.

 

Share this Article
Leave a comment