‘ప్రాజెక్ట్ కె’ (Project K) (వర్కింగ్ టైటిల్).. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే దీపికా పదుకొణె (Deepika Padukone) లుక్తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్.. తాజాగా డార్లింగ్ ప్రభాస్ లుక్ను విడుదల చేశారు.
కాగా అమెరికాలో ‘ప్రాజెక్ట్ కె’ (Project K) సందడి మొదలైంది. కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో (Comic-Con) పాల్గొనడం కోసం చిత్ర బృందం అమెరికా వెళ్లనుంది. ఇప్పటికే ప్రభాస్, రానా (Rana Daggubati), కమల్ హాసన్ (Kamal Haasan)లు అక్కడకు చేరుకున్నారు. అదే వేదికపై టైటిల్, ట్రైలర్ను విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్పై స్పష్టతనివ్వనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.