దేశ వ్యాప్తంగా నిలిచిన వాట్సాప్ సేవలు

Bharat Shorts

న్యూఢిల్లీ: వాట్సాప్‌ (Whatsapp) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో ఈ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌(Whatsapp)ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా రోజుకు 10 వేల కోట్ల చొప్పున మెసేజ్‌లు వెళ్తుంటాయి. వాట్సాప్‌ డౌన్‌ కావడంతో యూజర్లు ప్రస్తుతం టెలిగ్రామ్‌కు స్విచ్‌ అవుతున్నారు.

ఈ విషయంపై వాట్సాప్ (Whatsapp) పేరెంట్ కంపెని మెటా స్పందించింది. “మెసేజులు పంపించేందుకు కొందరు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించామని, మళ్ళీ అందరికి వాట్సాప్ ను రీస్టోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం అని మెటా వెల్లడించింది. అయితే సేవలు నిలిచిపోయిన దాదాపు గంట తరవాత క్రమంగా సమస్య పరిష్కారమైంది.

ఇప్పటికే ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో #WhatsappDown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. వాట్సాప్ ఇంతసేపు నిలిచిపోవడంతో మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ అటాక్ అని కూడా సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share this Article
Leave a comment