18న ఉప్పల్‌లో భారత్‌ – న్యూజిలాండ్‌ వన్డే.. ఎల్లుండి నుంచి టికెట్లు విక్రయం

India - New Zealand Match

త్వరలో భారత్‌, న్యూజిలాండ్‌ (India – New Zealand) మద్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాందీ ఇంటర్‌నేషనల్‌ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్‌ 21న రాయ్‌పూర్‌లో, మూడో వన్డే 24న ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. టీ20 సిరీస్ 27న రాంచీ, 29న లక్నో, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఇక హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మ్యాచ్‌ జరుగనుంది. చివరి వన్డే మ్యాచ్‌ 2019, మార్చి 2న భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది.

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ కోసం సీహెచ్‌సీఏ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా గురువారం నుంచి భారత్‌ – న్యూజిలాండ్‌ (India – New Zealand) వన్డే మ్యాచ్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లను విక్రయిస్తున్నామని, ఆఫ్‌లైన్‌లో విక్రయించడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఫిజికల్‌ టికెట్‌ ఉంటేనే స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నుంచి 18 వరకు ఫిజికల్‌ టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్‌ టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు మ్యాచ్‌ టికెట్లు అమ్మడం లేదని, బ్లాక్‌ టికెట్ల అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share this Article
Leave a comment