KGF-2: గతేడాది ఇదే రోజున భారీ అంచనాలతో విడుదలైన కేజీఎఫ్-2.. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. ఒక్క కన్నడనే కాదు రిలీజైన ప్రతిభాషలోనూ కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో అక్కడి సినిమాలను సైతం వెనక్కినెట్టి విజయకేతనం ఎగురవేసింది.
ఇక శుక్రవారంతో ఈ సినిమా (KGF-2) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్రబృందం కేజీఎఫ్ సెకండ్ పార్ట్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. అందులోనే పార్ట్-3కి (KGF-3) సంబంధించిన హింట్‌ను ఇచ్చింది. అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిజంగా నెరవేరిందా? అంటూ వీడియోలో పార్ట్-3 ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వీడియోకు హోంబలే ఫిల్మ్ సంస్థ ఓ నోట్‌ను జతచేసింది. మరుపురాణి క్యారెక్టర్లు, యాక్షన్‌తో కేజీఎఫ్-2 ప్రయాణం అద్భుతంగా సాగింది. గ్లోబల్ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాతే పార్ట్-3 పట్టాలెక్కే అవకాశం ఉంది.