...

Parawada Pharma City: విశాఖ పరవాడ పార్మాసిటీ దెబ్బకు మంచం పట్టిన తాడి గ్రామం

Thadi Village

Parawada Pharma City: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడలో ఏర్పాటైన ఫార్మాసిటీ నుంచి విడుదలయ్యే కాలుష్యంతో తాడి గ్రామం బాధిత గ్రామంగా మారింది. ఈ గ్రామాన్ని తరలిస్తామని సీఎం కాక ముందు జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సీఎం హోదాలో 2022 ఏప్రిల్ 28న మరో పది రోజుల్లో తాడిని తరలిస్తామని చెప్పారు. కానీ, ఇప్పటీ వరకు ఆ తరలింపు జరగలేదు. పైగా 2023 అక్టోబర్ 16వ తేదీన తాడి గ్రామానికి పావు కిలోమీటరు దూరంలోనే మరో ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవం కూడా సీఎం జగనే చేశారు. ఇక్కడ సీఎంకు తమ గోడు చెప్పుకుందామని వెళ్లిన తాడి గ్రామ బాధితులకు అవకాశం కూడా కల్పించలేదు.

Deals on TVs to match every room size | Blockbuster deals | Smart LED TV

 

అసలు తాడి గ్రామానికి ఏమైంది?

పరవాడలో ఫార్మా (Parawada Pharma City) కంపెనీల కోసం దాదాపు 2400 ఎకరాల్లో ఫార్మాసిటీని 2006లో ప్రారంభించారు. దీనికి ఫార్మా డెవలపర్‌గా రాంకీ (Ramky) వ్యవహారిస్తోంది. ప్రస్తుతం ఈ ఫార్మాసిటీలో 90 పరిశ్రమలున్నాయి. ఈ ఫార్మాసిటీని అనుకుని ఉన్న గ్రామమే తాడి (thadi Village). ఈ గ్రామానికి, ఫార్మాసిటీకి మధ్య కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుంది. గ్రామానికి అంత సమీపంలో ఫార్మాసిటీ ఉంది. తాడి గ్రామ జనాభా దాదాపు 2700. ఫార్మాసిటీ ప్రారంభమైన తర్వాత తాడి గ్రామస్థులు ఇక్కడ ఫ్యాక్టరీలలోనే ఉద్యోగులుగా చేరారు. కొంతకాలం బాగానే గడిచింది. ఆ తర్వాత క్రమంగా తాడి గ్రామస్థులు రోగాల బారిన పడటం మొదలైంది. దీంతో ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యంతోనే తమ గ్రామంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తమని ఇక్కడ నుంచి తరలించాలని తాడి తరలింపు బాధితుల సంక్షేమ సంఘంగా ఏర్పడి పోరాటాలు చేయడం మొదలు పెట్టారు. మరో వైపు అనారోగ్యాలతో గ్రామంలోని చాలా మంది మంచాలకే పరిమితమవ్వడం కూడా మొదలైంది.

2019లోనే తరలింపు జీవో…

తాడి గ్రామం మూడు భాగాలు ఉంటుంది. తాడి, చినతాడి, బీసీ కాలనీలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 742 కుటుంబాలున్న తాడి గ్రామంపై ప్యాక్టరీల కాలుష్యం తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటు ఫార్మాసిటీలో ఏ ప్రమాదం జరిగినా తమ గ్రామంలో ఏమైపోతుందనే ఆందోళన నిత్యం తాడి గ్రామస్థులను వెంటాడుతూనే ఉంటుంది. 2022 నుంచి ఇప్పటీ వరకు ఫార్మాసిటీలో 12 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి తాడి గ్రామస్థులు అక్కడ నుంచి ఇతర గ్రామాలకు తరలివెళ్లిపోవడం, మళ్లీ పరిస్థితి సద్దుమణిగాక రావడం పరిపాటిగా మారిందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాద్యాక్షులు జి. సత్యనారాయణ చెప్పారు. “టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు రూ.57.63 కోట్లు విడుదల చేస్తూ 2019 ఫిబ్రవరి 6న జీవో-29ను విడుదల చేసింది. ఈ జీవోలో తాడి గ్రామాన్ని అక్కడ నుంచి పది కిలోమీటర్లు దూరంలో ఉండే పెదముసిడివాడకు తరలించేందుకు అవసరమయ్యే ఇళ్ల పరిహారం చెల్లింపు, రవాణా ఛార్జీలు చెల్లింపు, ఇళ్ల స్థలం, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలని చేర్చింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ జీవో ఏమైందో తెలియలేదు, తరలింపు జరగలేదు. పైగా ఎన్నికల హామీలో భాగంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే తాడి గ్రామాన్ని తరలిస్తామని చెప్పారు” అని సీఐటీయూ సత్యనారాయణ చెప్పారు.

Deals on TVs to match every room size | Blockbuster deals | Smart LED TV

‘‘పది రోజుల్లో తరలిస్తాం’’

ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీతో పాటు సీఎం అయిన తర్వాత కూడా 2022 ఏఫ్రిల్ 28న అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో జరిగిన బహిరంగ సభలో అవసరమైన రూ. 56 కోట్ల నిధులు విడుదల చేసి తాడి గ్రామాన్ని వారం నుంచి పది రోజుల్లో తరలిస్తానని ముఖ్యమంత్రి హోదాలో స్పష్టంగా చెప్పారు. కానీ ఇంత వరకు అది జరగలేదు. పైగా 2023 అక్టోబర్ 16న తాడి గ్రామానికి పావు కిలోమీటరు దూరంలోనే మరో ఫార్మా కంపెనీని సీఎం స్వయంగా ప్రారంభించారు, దానికి పక్కనే ఉన్న తాడి ప్రస్తావన రాలేదు. “సీఎంను కలిసి మా గోడు చెప్పుకుందామని వెళ్లేందుకు ప్రయత్నిస్తే వెళ్లనివ్వలేదు. పైగా ముందు రోజు బాధిత సంఘం నాయకులని, సీఐటీయూ ప్రతినిధులను అరెస్ట్ చేశారు. తరలింపుపై ముఖ్యమంత్రి ఇచ్చిన మాటపై ఆయన నిలబడకపోతే మేం ఇంకెవరిని అడగాలి” అని తాడి గ్రామస్తులు వాపోతున్నారు.

Share this Article
Leave a comment
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.