ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో విస్తీర్ణపరంగా 12,551 చ.కి.మీతో రెండో స్థానంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఓటర్ల (Voter List) పరంగా చివరి స్థానంలో ఉంది. ఇదివరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేటప్పుడు పాడేరు డివిజన్‌లో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గాన్ని కలిపి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ నియోజకవర్గాలున్న (3) జిల్లా కూడా ఇదే. 2021 జనవరిలో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో కలిపి 4,56,710 మంది ఓటర్లు ఉండేవారు. తాజాగా రంపచోడవరంతో కలిపి ముసాయిదా ఓటర్ల జాబితా (Voters List)ను విడుదల చేశారు.