ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..!

Visakhapatnam: ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, తెలుగు వారు తలదించుకునేలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్ర వరం పర్యటనలో భాగంగా అనపర్తి దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని గంటా నూకరాజు అన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు చెప్పినట్లే చేస్తే ఇక చట్టాలకు విలువ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని, ఎంతో విలువలతో కూడిన శిక్షణ పొంది, ప్రజలకు అండగా ఉండవలసిన పోలీసులు ఇలా రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంగిస్తే ఇక ఈ రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంగణలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన పోలీసులు అధికార పార్టీ పెద్దల ఒత్తిడిలో చట్టాలను అపహాస్యం చేసేలా చేస్తున్నారని అన్నారు.

ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన నేత, ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత రక్షణలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనకు వెళితే ఎందుకు జగన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గలానికి, నారా చంద్రబాబు నాయుడు పర్యాటనలకు, మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు జనాల స్పందన ఊహించిన దానికంటే రెట్టింపు ఉండటంతో ఈ రాష్ట్ర ప్రభుత్వo డిఫెన్స్ లో పడిందని అన్నారు. అందుకే ఏమి చేయాలో తెలియక పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష నేతల యాత్రలను అడ్డుకుంటుందని ఎద్దేవా చేసారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజా స్వామ్య విలువలను గౌరవిస్తూ పాలన చేయాలని, మహాను భావుడు డా. బి. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉండకూడదని గంటా నూకరాజు అన్నారు.

Share this Article
Leave a comment