మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ (Prabhas) అభిమానులకు ‘ప్రాజెక్ట్-కె’ (Project K) (వర్కింగ్ టైటిల్) చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె (deepika padukone) కథానాయిక. అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న (project k release date) విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. భారీ చేయి కింద పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో చేయి వైపు గురి పెడుతూ నిలబడ్డారు. హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్‌ను తలపించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. మరోవైపు ‘ప్రాజెక్ట్ కె’ (Project K) సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఆ దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
Prabhas Project K: ప్రభాస్ అభిమానులకు నాలుగు నెలలకో పండగ..
తమ అభిమాన కథానాయకుడి నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ బొనాంజా తగిలినట్లే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’ (aadi purush). ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ (kriti sanon) కనిపించనుంది. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా జూన్ 16న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ (prashanth neel) రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’ (salaar). శ్రుతిహాసన్ (shruti haasan) కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్‌ను ప్రకటించారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కె’ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో నాలుగు నెలలకో ప్రభాస్ సినిమా రానుంది. వీటితో పాటు మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు వస్తే, ప్రభాస్ అభిమానులకు అంతకుమించిన పండగ ఇంకేముంటుంది.