Exam dates: SSC సీజీఎల్‌ టైర్‌- 2; సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌- 1 పరీక్ష తేదీలివే..

Ssc, cgl, chsl exam dates

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) గతేడాది కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవెల్‌ (CGL), కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్ష(CHSL)కు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీజీఎల్‌ టైర్‌- 1 పరీక్షను పూర్తి చేసిన ఎస్‌ఎస్‌సీ.. తాజాగా టైర్‌ 2 పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్‌ బి, సీ విభాగాల్లో సుమారు 20వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షను మార్చి 2 నుంచి 7వరకు నిర్వహించనున్నట్టు సోమవారం ప్రకటించింది. అలాగే, 4500 లోయర్‌ డివిజన్‌ క్లర్కులు, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ పరీక్ష టైర్‌- 1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/లో పొందొచ్చని ssc, SSC సీజీఎల్‌ టైర్‌- 2; సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌- 1 పరీక్ష తేదీలివే..అభ్యర్థులకు సూచించింది.

Share this Article
Leave a comment