ఇలా ‘నాటు నాటు’ కి ఆస్కార్ వచ్చింది, అలా అప్పుడే స్టార్ట్ చేసేశారు.

admin
By admin 3 Views
2 Min Read

ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu Song Oscar) పాటకి ఆస్కార్ (Oscars95) అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఇది భారతీయుడిగా గర్వకారణం, అలాగే ఈ అవార్డు తెచ్చినవాళ్లు తెలుగు వాళ్ళు అవటం మనకి ఇంకా సంతోషం. ఈ సంతోష సమయంలో సంబరాలు చేసుకుంటూ, చిత్ర పరిశ్రమలో అందరూ అవార్డు వచ్చినందుకు దానికి కారకులయిన వాళ్లందరికీ అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో సందట్లో ఎదో అన్నట్టుగా, మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ కథానాయకుడి తదుపరి సినిమా ఏ లెవెల్ లో ఉండబోతోందో అని ఊహించేసుకుంటూ, కటౌట్లు కట్టేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

మహేష్ బాబు (#SSMB29) ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో సినిమా చేస్తున్నాడు, అది ఇంకా షూటింగ్ మొదటి దశలో వుంది. ఈ సినిమా పూర్తయ్యాక ఆ తరువాత సినిమా రాజమౌళి తో చెయ్యాల్సి వుంది. ఇది ఒక ‘రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్’ (Raiders Of the Lost Ark) లాంటి అడ్వెంచర్ సినిమా అని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. ఇంక మహేష్ అభిమానులు మొదలెట్టేసారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ కి (Naatu Naatu Song Oscar) అవార్డు రావటంతో మహేష్ బాబు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అని మొదలెట్టేసారు

ఇప్పుడు సినిమా ప్రేక్షకుడు అభినందించాల్సింది రాజమౌళి అతని టీం సభ్యులని. తెలుగు వాడు ఊహించని విధంగా ఆస్కార్ వేదిక మీద తెలుగు జయకేతనం ఎగరవేసి, భారతదేశం గర్వపడేలా చేసినందుకు ఆనందపడాలి, సంతోషపడాలి, పండగ చేసుకోవాలి. ఇంకా మొదలు కాని రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి ఇప్పటి నుండే ఒత్తిడి పెంచేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. ముందు మహేష్, త్రివిక్రమ్ సినిమా పూర్తి చెయ్యాలి, ఆ తరువాత రాజమౌళి సినిమా. కథ కూడా ఇంకా డిసైడ్ కాలేదు, అందులో ఎవరెవరు చేస్తున్నారో తెలీదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం, ఆ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి అంటున్నారు. మహేష్ బాబు, రాజమౌళి ఫోటోలను కలిపి ఒక కాంబినేషన్ గా చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇలా ‘నాటు నాటు’ కి ఆస్కార్ వచ్చింది, అలా అప్పుడే స్టార్ట్ చేసేశారు.

admin
By admin