Raviteja – Ravanasura: కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే..?

admin
By admin 807 Views
2 Min Read

Raviteja – Ravanasura: మాస్ మహారాజా రవితేజ – సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్ష నగర్కార్, పూజిత పొన్నాడ నటిస్తుండగా హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను క్రియేట్ చేసాయి. రావణాసురగా రవితేజ నటన ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి ఈ మధ్య ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మంచి ఘాటు పదాలు ఉన్నాయని, వాటిని తొలగించి యూ/ఏ ఇస్తున్నా.. అస్సలు తొలగించాల్సిన అవసరం లేదని చిత్ర బృందం కావాలనే ఏ సర్టిఫికెట్ తీసుకుందని తెలియడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక తాజాగా ఈ చిత్రంలో రవితేజ (Raviteja – Ravanasura) డైలాగ్ ఒకటి లీక్ అయ్యిసోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది.. రా” అంటూ బేస్ వాయిస్ తో రవితేజ పూజిత పొన్నాడను పిలవడం, ఆమె టక్కున మంచం మీదకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. రావణాసుర అంటే ఏంటో ఈ ఒక్క క్లిప్ చూపించేస్తోంది. ఇలాంటి డైలాగ్స్, రవితేజ విశ్వరూపం సినిమాలో చూడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

/ Web Stories /

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kayadu lohar Latest Pics Viral #kayadu_lohar Archita Phukan photos with adult star Kendra Lust goes viral