ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై విష్ణుకుమార్రాజు సంచలన వ్యాఖ్యలు

admin
By admin 14 Views
1 Min Read

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు (Vishnukumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, బీజేపీ (YCP BJP) దొందూ దొందే అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ (PM Modi), కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah)లతో సీఎం జగన్ (CM Jagan) ఫొటోలు తీసుకోవడం చూసి.. వైసీపీ, బీజేపీ ఒకటే అనుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖను పాలన రాజధాని అనడం ప్రజలకు ఇష్టం లేదని, అందుకే వైసీపీని ఓడించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి శుభపరిణామమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని విష్ణుకుమార్రాజు ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌ (Madhav)కు చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

Share this Article
Leave a comment

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై విష్ణుకుమార్రాజు సంచలన వ్యాఖ్యలు

admin
By admin