తప్పని డోలు మోతలు.. ఆగని మరణాలు

విశాఖపట్నం: అనంతగిరి మండలం పినకోట మారుమూల పంచాయతీ గుమ్మంతి గ్రామం గెమ్మిల గంగమ్మ (60 ) అనారోగ్యంతో బాధపడుతుంటే గ్రామస్తులు పిన్నకోట ఆస్పత్రికి తీసుకెళ్తూ మార్గం మధ్యలో మృతి చెందింది. వైద్యం కోసం డోలి (Doli) మోసుకెళ్తూ తీసుకెళ్తూ మార్గం మధ్యలో ఈ నెలలో గంగమ్మ మరో ఇద్దరు హాస్పటల్లో మృతి చెందారు. 2017-18 సంవత్సరంలో కోటి 35 లక్షల రూపాయలతో బల్లగరం నుండి దాయర్తి వరకు 11 గ్రామాల రవాణా సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం కోసం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. భారీ వర్షాలు రావడంతో ఈ రోడ్డు మొత్తం కొట్టిపోయింది. కొత్త ప్రభుత్వం రావడంతో 2021 సంవత్సరంలో NRGS నిధులతో కోటి 20 లక్షల రూపాయలు పంచాయతీల రాజ్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి స్థానిక జడ్పిటిసి. మండల అధ్యక్షురాలు ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారు. పనులు మొదలు పెట్టకపోవడంతో ఈ డోలు మోతలు తప్పడం లేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గిరిజన సంఘం ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ప్రభుత్వ నిధులు ఇవ్వలేదని అందువల్ల పనులు చేయలేదని సమాధానం చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం5 ఐదో షెడ్యూల్ సాధన కమటీ గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు, పినకోట వార్డు సభ్యుడు జములు విజ్ఞప్తి చేయడం జరిగింది

Share this Article
Leave a comment