ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో (Mlc Elections 2023) తెదేపా సత్తాచాటింది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరిచిన తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపొందారు. 11,551 కోటా ఓట్లు సాధించడంతో చిరంజీవిరావు అధికారికంగా విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు 55,749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు, భాజపా అభ్యర్థి పీవీఎన్ మాధవ్కు 10,884 ఓట్లు పోలయ్యాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.