స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం

సినిమా వార్తలు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గాను.. జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్నాడు. స్వయంగా జీక్యూ బృందమే హైదరాబాద్‌కు వచ్చి బన్నీకి ఆ అవార్డ్‌ని అందజేసింది. అతడ్ని లీడింగ్ మ్యాన్ టైటిల్‌తో గౌరవించింది. ఐకానిక్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి మరీ బన్నీకి ఈ అవార్డ్‌ని అందజేశారని సమాచారం.

కాగా.. ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పుష్ప: ద రూల్ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించాలని ఫిక్సయ్యారు. నిజానికి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సీక్వెల్ ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకి వెళ్లాల్సింది. కానీ.. ఇది పాన్ ఇండియా హిట్ అవ్వడం, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరగడంతో, పాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా ఈ సినిమాకి మెరుగులు దిద్దాడు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ కోసమే చాలాకాలం సమయం తీసుకున్నాడు.

Share this Article
Leave a comment