ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విశాఖ వాసులు మృతి

ఒరిస్సా లో కుర్దా  రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారుతి కార్ లో విశాఖ వాసులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యువకులు ఇద్దరు మహిళగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం నుండి పూరి ఈవెంట్ ప్రోగ్రామ్ కోసం వెళ్లి  పూర్తి చేసుకుని ఒరిస్సా నుంచి విశాఖకు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగంతో యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనఢంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం. మృతుల్లో మారియా ఖాన్ మేకప్ ఆర్టిస్ట్, లక్ష్మి, కబీర్, రాఖి ఉన్నట్లు సమాచారం. ఒరిస్సా పోలీసులు అక్కడ ఉన్న మృతదేహాలను హాస్పిటల్ కి  పోస్టుమార్టం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Article
Leave a comment