AP: తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రధాన రోడ్డులో చేపల మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్ మీద వెళుతున్న ఇద్దరుని వెనకాల వస్తున్న కారు ఢీకొట్టింది. బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి దిగి వచ్చి కారు పైకి ఎక్కి కారును గట్టిగా తన్నాడు. ఇదంతా రోడ్డు మధ్యలో జరిగడంతో స్థానికులు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. కింద పడ్డ వ్యక్తికి తలకు స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది.