Visakhapatnam Crime News: తొడ కండరంలో నుంచి ఛాతి వరకు దూసుకెళ్లిన పిల్లర్ ఇనుప రాడ్‌

Iron Rod on Body

Visakhapatnam Crime News: ఓ వ్యక్తి మద్యం మత్తులో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పిల్లర్‌పై పడిపోవడంతో ఇనుప ఊచ (రాడ్‌) (Irin Rod) ఎడమ పిరుదుల్లోనుంచి గుండె కండరాల్లోకి దూసుకెళ్లిన ఘటన విశాఖ నగరం బిర్లా జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. బిర్లా జంక్షన్‌ (Birla Junction) వద్ద నివాసం ఉంటున్న గుడి అప్పలరాజు(36) పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రతి రోజులానే మద్యం తాగి, సాయినగర్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద కూర్చున్నాడు. మద్యం మత్తులో ఒక్కసారిగా అదుపు తప్పి కింద ఉన్న పిల్లర్‌పై పడిపోయాడు. దీంతో పిల్లర్‌కు సంబంధించిన ఇనుప ఊచ ఎడమ పిరుదు లోపలికి దూసుకెళ్లింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు కట్టర్‌ ద్వారా  రాడ్‌ను రెండువైపుల కోసి, అప్పలరాజుని శస్త్ర చికిత్స నిమిత్తం కేజీహెచ్‌ (KGH)కు తరలించారు. తొడ కండరంలో నుంచి ఛాతి వరకు రాడ్‌ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు డాక్టర్‌ జె.కిశోర్‌, డాక్టర్‌ ధర్మ కిశోర్‌, డాక్టర్‌ నవేద్‌ఖాన్‌ రంగంలోకి దిగి నరాలకు ఎటువంటి నష్టం కలగకుండా శస్త్రచికిత్స చేసి రాడ్‌ను శరీరం నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై అప్పలరాజు భార్య ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు (Visakhapatnam Crime News) పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Article
Leave a comment