Business Ideas: రాబోయే రోజుల్లో ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్.. లక్షల్లో లాభాలు

admin
By admin 2 Views
3 Min Read

Business Ideas: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఉద్యోగాలు కంటే స్వయం ఉపాది వైపే ఎక్కువగా అడుగులు వేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే స్వయం ఉపాది ఏ విధంగా కల్పించుకోవాలి..? ఏ వ్యాపారం చేయాలి..? వ్యాపారం చేయాలంటే ఎంత మొత్తంలో పెట్టుబడి ఉండాలి అనే ఆలోచనలో (Business Ideas) చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారు ఇది ఒకసారి ఆలోచించి చూడండి.

మనదేశంలో మినరల్ వాటర్ బిజినెస్ (Mineral Water Business) ప్రతి సంవత్సరం పెరుగుతోంది. బాటిల్ వాటర్ వ్యాపారం ఏటా 20% చొప్పున వృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి.

మీరు మినరల్ వాటర్ (Mineral water plant) వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందుగా ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి. కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేయాలి. పాన్ నంబర్, GSTనంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. అధికార యంత్రాంగ నుంచి లైసెన్స్, ISI నంబర్ తీసుకోవాలి.

Water plant Business

- Advertisement -

కొందరు ఇవేమీ లేకుండా.. జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్‌వో ఫిల్టర్‌తో పాటు పలు యంత్ర సామాగ్రి అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసేందుకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్‌ని అందించవచ్చు. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్లను తయారుచేస్తున్నాయి. వాటికి రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్నవాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాలి.

అన్ని ఖర్చులు కలిపి.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత డబ్బు మీ వద్ద లేకుంటే.. బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చు. గంటకు 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పితే.. కనీసం రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సులభంగా సంపాదించే అవకాశం ఉంది.

మీకు 400 మంది కస్టమర్లు ఉండి.. వారికి రోజుకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.15 నుంచి రూ.25 వరకు ఉంటుంది. సిటీలలో అయితే రూ.25 పైనే ఉంటుంది. అంటే ఈ లెక్కన మీకు రోజుకు రూ.10వేలు వస్తాయి. నెలకు మూడు లక్షల ఆదాయం వస్తుంది.

ఇందులో కరెంటు బిల్లు, డీజిల్, సిబ్బంది జీతం ఖర్చులు లక్షన్నర రూపాయల వరకు పోయినా.. మీకు రూ. లక్షా 50వేల నికర లాభం వస్తుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ.. లాభం కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *