ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు.. మిగులు సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానం..

admin
By admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత విద్యకై కేటాయించిన 25% సీట్లలో మిగిలిన ఖాళీల భర్తీకి అదనపు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఆగస్టు 12 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అడ్రస్ కోసం ఆధార్/ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణకు రేషన్ కార్డు సరిపోతుంది. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు 18004258599 అనే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఆన్లైన్లో దరఖాస్తు కు ప్రధాన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభం: 12 ఆగస్టు 2025
అప్లికేషన్ చివరి తేదీ: 20 ఆగస్టు 2025
అర్హత నిర్ధారణ: 21 ఆగస్టు 2025
లాటరీ ఫలితాలు: 25 ఆగస్టు 2025
అడ్మిషన్ ఖరారు: 31 ఆగస్టు 2025

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *