Sonu Sood: 2500 కిలోల బియ్యంతో సోను సూద్ చిత్రం.. వీడియో వైరల్

admin
By admin 516 Views
1 Min Read

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌ (Sonu Sood) ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు అభిమానులు వినూత్న రీతిలో ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో సోనూసూద్‌ అభిమానులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. 2500 కేజీల బియ్యంతో ఆయన రూపాన్ని తీర్చిదిద్దారు. ప్లాస్టిక్‌ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూసూద్‌ చిత్రాన్ని రూపొందించారు. తుకోజీరావు పవార్‌ స్టేడియంలో ఎకరం స్థలంలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.  అనంతరం ఈ బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఫతేహ్‌ (Fateh) సినిమాలో నటిస్తున్నారు.

Share this Article
Leave a comment