Rameswaram Cafe: చూస్తె టిఫిన్ సెంటర్.. ఆదాయం 50 కోట్లు

admin
By admin 1.6k Views
2 Min Read

Rameswaram Cafe Success Story: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే పదానికి ట్రెండీ ఎగ్జాంపుల్​ కావాలంటే.. బెంగుళూరులో ఉన్న రామేశ్వరం కేఫ్ టిఫెన్​ సెంటర్​ను​ చూపించొచ్చు. 24/7 కస్టమర్లతో కళకళ.. గల్లాపెట్టె గలగలా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి! అనతి కాలంలోనే ఎంత ఎదిగిందంటే.. రాష్ట్రం, దేశం సరిహద్దులు కూడా దాటించి.. విదేశాలలో బ్రాంచ్​ ఓపెన్ చేసేందుకు చూస్తున్నారు.

అహ్మదాబాద్‌ IIMలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసి, అడిషనల్​ క్వాలిఫికేషన్ గా CA చదివి.. ఉడిపి హోటల్​లో గరిట పట్టుకునేందుకు సిద్ధమైంది దివ్యారాఘవేంద్ర. ఫుడ్​ ఫ్యాక్టరీలో 15ఏళ్ల ఎక్స్​పీరియన్స్ ఉన్న రాఘవేంద్రతో చేయి కలిపింది. ఓ కామన్​ ఫ్రెండ్​ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ.. ముందు స్నేహితులయ్యారు. ఆ తర్వాత బిజినెస్​& లైఫ్ పార్ట్​నర్స్​ అయ్యారు. ఇప్పుడు బ్రేక్​ ఫాస్ట్​ ప్రపంచాన్ని దున్నేస్తున్నారు. కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరు మీద ‘రామేశ్వరం కేఫ్‌’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్‌లను 2021లో ప్రారంభించారు.

Rameswaram Cafe

రామేశ్వరం కేఫ్ (Rameswaram Cafe) దూసుకుపోతున్న తీరు.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిఫెన్​ సెంటర్ మీద ఆదాయమంటే నెలకు ఓ “లకారం” వేసుకోండి! అంతేగానీ లక్షలు దాటి కోట్ల రూపాయల ఆదాయం​ ఏంది సామీ! అన్నది జనాల మాట. ఈ రెస్టారెంట్ నెలకు దాదాపుగా రూ.4.5 కోట్లు ఆర్జిస్తోందట. అంటే.. సంవత్సరానికి ఏకంగా 50 కోట్ల పైమాటే!. ఫేమస్​ టీవీ షో “మాస్టర్‌ చెఫ్ ఆస్ట్రేలియా”లోని జడ్జీలలో ఒకరైన ప్రముఖ చెఫ్ గ్యారీ మెహిగాన్ కూడా రామేశ్వరం కేఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను తిన్న దోశ గురించి ఒక వీడియోను షేర్ చేయడంతో.. ఈ కేఫ్ మరింతగా వైరల్ అయ్యింది.

- Advertisement -

ఒక బిజినెస్​ ఈ స్థాయిలో డెవలప్ కావడానికి ఏళ్లు పడుతుంది. కానీ.. రామేశ్వరం కేఫ్ వయసు కేవలం రెండేళ్లే! 2021లో ఈ కేఫ్ ఫస్ట్ బ్రాంచ్​​ స్టార్ట్ చేశారు. తమదైన క్వాలిటీ.. టేస్ట్​తో అనతి కలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని సాధించారు. ఇంకేముంది? జనాలు దారికట్టడం మొదలు పెట్టారు. దీంతో.. నిర్వాహకులు క్రమంగా ఔట్​లెట్లను విస్తరించడం మొదలు పెట్టారు. దోశ, ఇడ్లీ, వడ అంటూ.. సౌత్​ ఇండియా డిషెస్​ మొత్తం లభిస్తాయిక్కడ. ఈ కేఫ్​లో దాదాపు 200 మందికి పైగా పనిచేస్తుంటారు. రామేశ్వరం కేఫ్ పేరు మార్మోగుతుండడంతో.. సాధ్యమైనన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ శాఖలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

/Web Stories/

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kayadu lohar Latest Pics Viral #kayadu_lohar