విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (muttamsetti srinivas) కు సొంత పార్టీ నాయకుల నుంచి అసమ్మతి సెగ తగిలింది. ఆసరా పథకం నిధుల విడుదల నేపథ్యంలో శనివారం సాయంత్రం జీవీఎంసీ 98వ వార్డు అడివివరంలో జరిగిన సమావేశంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆ వార్డు వైకాపా ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే ఒకవర్గానికి కొమ్ముకాస్తున్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు గుంభనంగా ఉన్న ఒకవర్గం మొత్తం సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.