యూకేకు చెందిన సుమారు 100 కంపెనీలకు పైగా ఉద్యోగులతో వారానికి 4 రోజులు (working hours) మాత్రమే పనిచేయించుకుంటున్నాయి. అలా చేయడం వల్ల వర్క్ ప్రొడక్టవిటీ పెరగడం సహా కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ప్లైమౌత్ సిటీలో మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఫ్యూయల్’ కంపెనీ పని దినాలను 5 నుంచి 4 రోజులకు తగ్గించింది. అయితే రోజుకు సుమారు 10 గంటలు పనిచేయాలి.