విశాఖ: వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు

By Prasad Kalla - Editor
695 Views
1 Min Read
Telegram Telegram Group
Join Now

AP Elections 2024: విశాఖలో భారీగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలు శుక్రవారం రాత్రి ఆయన కార్యాలయంపై దాడులు చేశాయి. సుమారు ఆరు గంటలకు పైగా వేకువజాము వరకు అధికారులు సోదాలు చేశారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డుల్లో కూపన్లు, డిజిటల్ వాచ్‌లు, గాజులు, చీరలు, నగదు పంచేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితో పాటు MVV సత్యనారాయణ, ఆయన సన్నిహితుడు జి.వెంకటేశ్వరరావు కార్యాలయంలోనే ఉన్నారు. ఈ దాడిలో 25 నుంచి 30 మంది అధికారులు పాల్గొన్నారు. సీజ్ చేసిన కూపన్లు, డిజిటల్ వాచ్‌లు, గాజులు, చీరలు, నగదు ఇతర సామగ్రిని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read Also:

/Web Stories/

Share This Article
Editor
Follow:
I am Kalla Prasad, Founder & Admin of BharatShorts. I have been creating informative articles since 2019, mainly on finance, investments, government updates, and public-interest topics. My goal is to provide simple, accurate, and trustworthy information that genuinely helps readers.
Leave a Comment
kayadu lohar Latest Pics Viral #kayadu_lohar Archita Phukan photos with adult star Kendra Lust goes viral