విశాఖపట్నం జిల్లా పద్మనాభం (padmanabham) మండలం కృష్ణాపురం (krishnapuram) గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎంఎస్ఎంఈ పార్క్ కోసం తీసుకుంటున్న తమ భూములకి నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన చేస్తామని రైతులు నిరసన తెలిపారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో భూముల వద్ద వంటావార్పు కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి రైతుల తరుపున మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న భూములకి అదేవిధంగా తొలగించిన మొక్కలకి నష్టపరిహారం చెల్లించాలన్నారు. పరిశ్రమలలో రైతులకి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.
Read Also:
- ఎమ్మార్వో గదికి బయట తాళం.. ఫుల్గా మద్యం తాగి లోపల గురక – ఆపై సస్పెన్షన్ (VIDEO)
- ప్రియుడు మోజులో సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య