నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం (sperm donation) ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఓ మహిళ కోర్టులో కేసు వేశారు. ఈ మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం (sperm donation) చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. వీర్యదానం ద్వారా జొనథన్ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్‌వీఓజీ) అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. జొనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది.