అనంత పద్మనాభుని సన్నిధిలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

admin
By admin 3 Views
1 Min Read

విశాఖపట్నం: పద్మనాభం (Padmanabham) మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు మూడవరోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం వేకువజామున స్వామివారికి సుప్రబాత సేవ నిర్వహించిన తరువాత నగర సంకీర్తణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామి వారికి, అమ్మవారికి బేడా సేవా కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఉత్సవాలు జనవరి 14వ తేదీ వరకు జరగనున్నాయి.

Utsav Video in Padmanabham

ముఖ్య కార్యక్రమాలు

• ఈనెల 25వ తేదీన అనగా ఆదివారం కుంతీమాధవస్వామి వారికి నవనీతోత్సవము (వెన్నతో అలంకరణ) కార్యక్రమం నిర్వహించనున్నారు.

• జనవరి 2వ తేదీన అనగా సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గం.లకు పంచామృతాలతో అభిషేకం, తదుపరి గ్రామసేవా, ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ద్వార దర్శనం) నిర్వహించనున్నారు.

• జనవరి 14న అనగా శనివారం ఉదయం 7 గం. లకు స్వామి వారు, అమ్మవారు గోస్తనీ నదికి నీలాటి ఉత్సవం కి వెళ్ళుట, ఉదయం 9 గంటలకు గోదా రంగనాయక స్వామి వారి శాంతి కల్యాణం 11.30 ని. తీర్ధప్రసాదాల వితరణ మొదలైన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

• జనవరి 16న అనగా సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వారి మరియు అమ్మ వారి గిరిప్రదక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *