CTET Admit Card 2023: సీటెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

admin
By admin 22 Views
2 Min Read

CTET Admit Card 2023: ఆగస్టు 20న జరగనున్న సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) అడ్మిట్‌ కార్డులను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు https://ctet.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను (CTET Admit Card 2023) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. CTET Admit Card 2023 డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ 27న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE)  CTET 2023 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 20 భాషల్లో ఆగస్టు 20న CTET 2023 పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. మొత్తం 73 నగరాల్లోని 211 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది CTET 2023 పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. CTET 2023 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచింది.

సీటెట్‌..

కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా CTET ఉత్తీర్ణులై ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారి కోసం సీబీఎస్‌ఈ ప్రతి ఏడాది రెండు సార్లు జాతీయ స్థాయిలో CTET పరీక్షను  నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు. సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(TET)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

/Web Stories /

Share this Article
Leave a comment
Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar