భారతదేశంలో గత 24 గంటల్లో 918 కరోనా వైరస్ కేసులు (Covid cases) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 6, 350కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటావిడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, నాలుగు మరణాలు సంభవించడంతో మరణాల మొత్తం మరణాల సంఖ్య 5,30,806 కు పెరిగింది. రాజస్థాన్ నుండి ఇద్దరు మరియు కర్ణాటక మరియు కేరళలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు వెల్లడించారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు (Covid cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలలుగా వందలకు పడిపోయిన కేసులు.. శనివారం ఒక్కరోజే 1000కి పైగా నమోదయ్యాయి. దేశంలో 130 రోజుల తర్వాత రోజువారీ కేసులు 1000 దాటడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా శనివారం 1,071 కొత్త కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. గతవారం (మార్చి 12-18 మధ్య) దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదుకాగా.. అంతకు ముందు వారంతో పోల్చితే ఇది 85 శాతం అధికం. అలాగే, మరణాలు కూడా మూడు రెట్లు పెరిగాయి. మార్చి 4-11 మధ్య ఏడు రోజుల్లో ఆరు మరణాలు నమోదుకాగా.. గతవారం ఈ సంఖ్య 19గా ఉంది.