Job Vacancies: కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 14,600 అధ్యాపక పోస్టులు ఖాళీ

Job Vaccancies

Job Vacancies: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యా సంస్థల్లో భారీగా అధ్యాపక పోస్టుల ఖాళీలు( Job Vacancies) ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ (Lok Sabha) లో వెల్లడించింది. మొత్తంగా 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇప్పటివరకు 6వేల అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్ని భర్తీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనే కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు రాజీనామాలు చేయడానికి తోడు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు అవసరాల రీత్యా ఈ పోస్టుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయని వివరించారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఆయా విద్యా సంస్థలు తగిన చర్యలను తీసుకుంటున్నాయని తెలిపారు. 

Share this Article
Leave a comment