Padmanabham: అనంతపద్మనాభ స్వామి ఆలయ పునఃనిర్మాణానికి అధికారులు అంచనాలు

admin
By admin 501 Views
1 Min Read

విశాఖపట్నం: పద్మనాభం (Padmanabham) కొండపై కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం కొలతలు తీసి అంచనాల తయారు చేశారు. ఆరేళ్ల క్రితం పిడుగుపాటుకు ఆలయ గోపురం దెబ్బ తినడంతో ఈ ఆలయ పునర్నిర్మా ణానికి ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు 60 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు చేయగా.. దేవాదాయ శాఖ 48 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసింది. సింహాచలం దేవస్థానం 12 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. దీంతో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు టెండర్ పిలవడం కోసం ఎండోమెంట్ అధికారులు ఆలయ కొలతలు తీసుకుని అంచనాలు తయారుచేసి ఉన్నత అధికారులకు పంపిస్తామన్నారు. అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు.

/Web Stories/

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kayadu lohar Latest Pics Viral #kayadu_lohar