సంక్రాంతి రద్దీ నేపథ్యంలో (sankranti special trains) విశాఖ నుంచి విజయవాడకు ప్రత్యేక జన సాధారణ్ రైళ్లును (Jana sadaran train) నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాదారణంగా పండగ కోసం సొంత ఊర్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యే రోజుల్లో తీవ్ర రద్దీ ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ఆధ్వర్యంలో జన సాధారణ్ రైళ్లను నడపనున్నారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్లు లేకుండా, నేరుగా స్టేషన్‌కు వెళ్లి అప్పటికప్పుడు రైలు ఎక్కి ప్రయాణించొచ్చు. ఈ రైళ్లలో అన్నీ జనరల్ బోగీలే ఉంటాయి.
గత సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇలాంటి రైళ్లు (Jana sadaran train) అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిపై ప్రయాణికులకు సరైన అవగాహన లేక, జనసాధారణ రైళ్లు ఖాళీగా నడిచాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా రైల్వే అధికారులు ముందస్తుగా రైళ్ల వివరాలు, తేదీలు ప్రకటించారు. ఈ రైళ్లు ఈనెల 18 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ రైళ్ళు విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుతుంది. వీటితో పాటు విశాఖ- పార్వతీపురం (08656/66) మధ్య కూడా జన సాధారణ రైళ్లు (Jana sadaran train) అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
Sign in to your account