ఏపీ స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

ప్రాథమికంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం. కేవలం ఏపీ అభ్యర్థులకే అవకాశం. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉండాలి. Stree Nidhi, assistant manager

admin
By admin 112 Views

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అపెక్స్‌ సహకార సంస్థ, విజయవాడలో ప్రధాన కార్యాలయం కలిగిన.. స్వయం సహాయక మహిళా గ్రూప్‌ (SHGs)- స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (Stree nidhi jobs) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్: 170 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. మైక్రో ఫైనాన్స్, రూరల్‌ డెవెలప్‌మెంట్‌ రంగాల్లో అనుభవం ఉండడం మంచిది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.

వయోపరిమితి:

25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)

జీతం:

నెలకు రూ.25,000- రూ.30,000+ ఇతర అలవెన్సులు

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://streenidhi-apamrecruitment.aptonline.in ద్వారా మాత్రమే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 07.07.2025 సాయంత్రం 5:00 గంటల నుంచి దరఖాస్తు ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూర్తిచేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రూ.1,000 అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07.07.2025.
దరఖాస్తు చివరి తేదీ: 18.07.2025.

ముఖ్యమైన అంశాలు:

  •  ప్రాథమికంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం.
  •  కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకే అవకాశం.
  •  గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉండాలి.

Official Website:   Click Here

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *