Ayodhya Ram Mandir: 20 అర్చక పోస్టులకు 3వేల దరఖాస్తులు

By Prasad Kalla - Editor
1.3k Views
2 Min Read
Telegram Telegram Group
Join Now

Ayodhya Ram Mandir: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో పూజారుల కోసం రామ్‌ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (ram mandir teerth kshetra trust) అర్హత కలిగిన పూజారుల నుంచి కోరిన దరఖాస్తులకు ఊహించని స్పందన వచ్చింది. అర్చకుల పోస్టులకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. 20 పోస్టులకు దాదాపు 3వేల దరఖాస్తులు వచ్చాయని రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. వీరిలో 200 మందిని మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి.. అంతిమంగా 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని ట్రస్టు ప్రతినిధులు వెల్లడించారు. ఈ పోస్టులకు మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసిన 200 మందికి అయోధ్యలోని వీహెచ్‌పీ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవి చదివారా..?

  • IPPB: ఏడాదికి కేవలం రూ.299తో రూ.10 లక్షలు.. పోస్టాఫీస్ అదిరిపోయే పాలసీ
  • విశాఖ: ఆటోల్లో ప్రయనిస్తున్నారా.. ఆదమరిస్తే అంతే.
  • గొర్రెలు పెంపకానికి కోటి రుణం.. కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం
    ముగ్గురు సభ్యుల ప్యానల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులను పూజారులుగా నియమిస్తారు. అలాగే, వీరికి ఆరు నెలల శిక్షణ అనంతరం వివిధ పోస్టుల్లో నియమిస్తారు. అయితే, ఈ పోస్టులకు ఎంపిక కాని అభ్యర్థులకు సైతం ట్రైనింగ్‌ ఇచ్చి వారికి సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. భవిష్యత్తులో అర్చక పోస్టుల ఖాళీలు ఏర్పడితే వారికే ఛాన్స్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత అర్చకులు రూపొందించిన ఆధ్యాత్మిక సిలబస్‌పై ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. అలాగే, వీరికి రూ.2వేలు చొప్పున స్టైఫండ్‌ చెల్లిస్తారు. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అనే అంశంపై గోవింద్‌ దేవ్‌ గిరి మాట్లాడుతూ.. సంధ్యా వందనం అంటే ఏమిటి? పూజా విధానాలు, వాటికి సంబంధించిన మంత్రాలేంటి? రాముడిని పూజించేందుకు మంత్రాలు ఏమిటి? తదితర అంశాలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

/Web Stories/

Share This Article
Editor
Follow:
I am Kalla Prasad, Founder & Admin of BharatShorts. I have been creating informative articles since 2019, mainly on finance, investments, government updates, and public-interest topics. My goal is to provide simple, accurate, and trustworthy information that genuinely helps readers.
Leave a Comment
Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar