Where is Pushpa – Pushpa 2 – The Rule Telugu Glimpse

admin
By admin 15 Views
2 Min Read

Pushpa 2 – The Rule Telugu Glimpse: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక సినిమా ‘పుష్ప ది రూల్’ మాత్రమే. అప్డేట్ కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూసిన ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సుకుమార్ అండ్ టీం అల్లు అర్జున్ బర్త్ స్పెషల్ గా ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసారు. ఆ వీడియో (Where is Pushpa?) ప్రస్తుతం యౌట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

తాజాగా విడుదలైన వీడియో హైప్ పెంచేసింది. ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది బుల్లేట్ గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్. వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్ అంటూ ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Pushpa 2 – The Rule Telugu Glimpse Video

/Web Stories/

Share this Article
Leave a comment
kayadu lohar Latest Pics Viral #kayadu_lohar Archita Phukan photos with adult star Kendra Lust goes viral