ఒక్క పాటలో తెలుగు సహా ఐదు భాషలు.. పంజాబ్ వ్యక్తి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

kesariya song

సినిమా వార్తలు: వివిధ భాషలకు, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ప్రాంతాలు మారేకొద్దీ భాషలు మారిపోతూ ఉంటాయి. కానీ, సంగీతానికి ఆ హద్దులు లేవు. ప్రాంతాలు మారినా, ఆఖరికి దేశం దాటినా పాటకు భాషతో పనిలేదు. ఈ విషయాన్ని RRRలోని ‘నాటు నాటు’ పాట నిరూపించింది. ఈ అచ్చతెలుగు పాట ఆస్కార్ గెలుచుకుంది. దేశంలో పాన్ ఇండియా సినిమాలు మొదలైన తరవాత పాటకు ఉన్న హద్దులు మరింతగా చెరిగిపోయాయి. దీనికి పెద్ద ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పాట.

బ్రహ్మాస్త్ర సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ‘కేసరియా’ (kesariya song) పాట బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో ‘కుంకుమలా నువ్వే’ అని సాగే ఈ పాటను ఒక సిక్కు వ్యక్తి మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి పాడాడు. సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ పాటలో ఐదు భాషలను మిళితం చేసి అతడు ఆలపించిన తీరు, ఆ గాత్రం నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆఖరికి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను సైతం ఈ పాట ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ పాట ద్వారా యునైటెడ్ ఇండియా మెసేజ్ ఇచ్చాడు ఆ పంజాబీ వ్యక్తి. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

Share this Article
Leave a comment