Crime News: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

admin
By admin
49 Views
1 Min Read

Crime News: మహబూబాబాద్‌ జిల్లా కురవి వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీలోని గ్రానైట్‌ రాయి ఆటో పై పడింది.  ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో చిన్నగూడూరు మండలంలోని మంగూరిగూడెం నుంచి కురవికి నూతన సంవత్సర వేడుకల కోసం యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ మహబూబాబాద్‌ వైపు నుంచి మరిపెడ వైపు వెళ్తోంది. కురవి వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్‌ రాయి కింద పడిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మరో రెండు మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.

Share This Article
Leave a Comment