ఆంధ్రప్రదేశ్: ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ చేయాలని ఏపీ కేబినెట్ (ap cabinet meeting 2023) నిర్ణయించింది. షెడ్యూల్ కులాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే.. వివిధ కమిషన్ ఛైర్మన్ల పదవీకాలం కుదింపు చట్టసవరణకు ఆమోదం. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు ఆమోదం. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ఎడ్యుకేషన్ ఆర్డినెన్సు ప్రతిపాదనకు నిర్ణయం. పాఠశాలల్లో 5,388 మంది నైట్ వాచ్‌మన్ల నియామకానికి ఆమోదం. ఏపీ పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ బిల్లుకు ఆమోదం. 2023-27 పారిశ్రామిక విధానానికి ఆమోదం. ఏపీ వాటర్ వేజ్ బిల్లుకు ఆమోదం. అమలాపురం కేంద్రంగా 120 గ్రామాల విలీనానికి ఏపీ కేబినెట్ (ap cabinet meeting 2023) ఆమోదం తెలిపింది.
Read More: కోర్టుకు రండి.. సీఎం జగన్‌కు ఎన్‌ఐఏ న్యాయస్థానం ఆదేశం
అమరావతి: కోడికత్తి కేసులో వచ్చే నెల 10న విచారణకు హాజరుకావాలని ఏపీ సీఎం జగన్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతోపాటు ఆయన పీఏ నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసు అంశంపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్‌ను కోర్టు విచారించింది. కేసుకు సంబంధించిన కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.