అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా (USA) ప్రభుత్వం వీసా ప్రీమియం ప్రాసెసింగ్ (H-1B visa premium processing) ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వీసా ఫీజులు ఎందుకు పెరిగాయి?
అమెరికా వీసా వ్యవహారాలను చూసే USCIS తెలిపిన వివరాల ప్రకారం, 2023 జూన్ నుంచి 2025 జూన్ వరకు నమోదైన ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వీసా దరఖాస్తులను ప్రస్తుతం ఉన్న సాధారణ సమయానికి బదులు చాలా వేగంగా పరిశీలించి నిర్ణయం తీసుకునే Premium Processing Service నిర్వహణ ఖర్చులు పెరగడంతోనే ఫీజులు పెంచినట్లు స్పష్టం చేసింది.
ఏ వీసాలపై ఫీజు పెరుగుతోంది?
ఈ తాజా మార్పులు ప్రధానంగా క్రింది వీసాలపై ప్రభావం చూపనున్నాయి:
హెచ్-1బీ (H-1B visa premium processing), L-1,(L-1 visa premium processing fee) O-1 (O-1 visa lawyer USA), P-1, (P-1 visa premium processing fee), TN (TN visa premium processing fee)వీసాలు (ఫారం I-129), ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు US $2,805 నుంచి US $2,965 కు పెంపు
F-1, J-1 వీసాలు (ఫారం I-539), ఫీజు US $1,965 నుంచి US $2,075 కు పెరుగుతోంది
అంటే ఉద్యోగ వీసాలే కాకుండా స్టూడెంట్ వీసాలకు కూడా అదనపు ఖర్చు తప్పదు.
ఎవరి మీద ఎక్కువ ప్రభావం?
ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి అమెరికా (India-USA)కు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, స్కిల్ వర్కర్లు ఎక్కువగా ప్రభావితమవుతారని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా:
త్వరగా వీసా అప్రూవల్ కావాలనుకునే వారు
యూనివర్సిటీ అడ్మిషన్ డెడ్‌లైన్లు దగ్గరలో ఉన్న విద్యార్థులు
ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్స్ ఉన్న ఉద్యోగులు
వీళ్లకు ఇప్పుడు వీసా ఖర్చు మరింత పెరిగినట్లే.
పెరిగిన ఫీజులతో లాభం ఏమిటి?
USCIS ప్రకారం, ఈ పెరిగిన ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సేవలను మరింత వేగంగా చేయడానికి, అప్లికేషన్ బ్యాక్‌లాగ్ తగ్గించడానికి, సిబ్బంది, టెక్నాలజీ మెరుగుదలకు వినియోగిస్తామని తెలిపింది.
అమెరికా వెళ్లాలనే కలతో ఇప్పటికే భారీ ఖర్చులు ఎదుర్కొంటున్న భారతీయులకు, ఈ ఫీజు పెంపు మరో ఆర్థిక ఒత్తిడిగా మారింది. మార్చి 1కు ముందు దరఖాస్తు చేసే వారు పాత ఫీజుతో పొందవచ్చు. ఆ తర్వాత అప్లై చేసే వారు మాత్రం కొత్త రేట్లకు సిద్ధంగా ఉండాల్సిందే.
👉 మీరు USA వీసా అప్లికేషన్ ప్లాన్ చేస్తున్నారా?
👉 ఈ ఫీజు పెంపు మీపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.