TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. జూన్ నెలకి చెందిన శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదలకానుంది. ఇవాళ(మార్చి 21న) మధ్యాహ్నం 12 గంటలకు టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. జూన్ నెలకి సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు మార్చి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉంటాయి. జూన్ నెలకు సంబంధించిన మిగిలిన ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.
లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు చెందిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో (TTD Online Tickets) విడుదల చేయనుంది టీటీడీ. జూన్ నెల వికలాంగుల దర్శనం టికెట్లు మార్చి 24 మద్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.