Visakhapatnam: ప్రయాణికుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విశాఖపట్నం–కేరళలోని కొల్లం మధ్య 20 ప్రత్యేక రైళ్లను (Special Trains to Sabarimala) నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 18 నుంచి ప్రతి మంగళవారం విశాఖ–కొల్లం (08539), ప్రతి బుధవారం కొల్లం–విశాఖపట్నం (08540) ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మార్గంలో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక ట్రైన్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ బోగీలు ఉండనున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లు నడుస్తాయని రైల్వే వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని, ప్రయాణికులు ఈ ప్రత్యేక సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.