snake farming: గ్రామ జనాభా 1000 మంది.. 100కి పైగా స్నేక్ ఫామ్స్

admin
By admin 46 Views
1 Min Read

snake farming: చైనాలోని జెజియాంగ్(Zhejiang) ప్రావిన్స్‌లోని జిసికియావో గ్రామంలోనివారు విషపూరిత పాములను పెంచుకుంటారు. ఈ గ్రామంలో పాముల పెంపకం (snake farming) విరివిగా జరుగుతుంది. గ్లోబల్ టైమ్స్(Global Times) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ఇక్కడ 30 లక్షలకు పైగా పాములను పెంచుతారు. గ్రామంలో నివసించే ప్రజలకు ఈ పాములే ప్రధాన ఆదాయ వనరు(source of income). చైనాలో పాముల పెంపకం సంప్రదాయం చాలా పురాతనమైనది. ఈ గ్రామంలో 1980వ సంవత్సరంలో మొదటిసారిగా పాములను పెంచినట్లు చెబుతారు. పలు చైనీస్ ఔషధాలలో(medicine) విషపూరిత పాములను విస్తృతంగా ఉపయోగిస్తారు. గ్రామంలో సుమారు 1000 మంది నివసిస్తున్నారు. గ్రామంలో 100కి పైగా స్నేక్ ఫామ్స్ ఉన్నాయి. బడా వ్యాపారులు వచ్చి గ్రామంలో పాముల వేలం(auction) వేస్తారు. ఇక్కడి పాములు చైనాతో పాటు అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా(South Korea)లకు కూడా రవాణా అవుతుంటాయి.

Share this Article
Leave a comment