విశాఖపట్నం: పద్మనాభం (Padmanabham) మండలంలోని పద్మనాభం సచివాలయం వద్ద నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్దు(పాప) మరియు సచివాలయం సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.