RANU BOMBAI KI RANU FULL SONG LYRICS TELUGU | RAMU RATHOD | LIKHITHA |
అద్దాల మేడలున్నాయే
మేడల్లా మంచి చిరలున్నాయే
చీరంచు రైకలున్నాయే
కొనిపిస్తా నాతో బొంబాయి రాయే
రాను నే రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాయే రాయే పిల్ల
రంగుల రాట్నం ఎక్కించి జతరంతా చూపిత్తా
రాను రాను పొలగా
రంగుల రాట్నం ఎక్కించి న్నన్ ఆగం చేస్తావంట
అందుకే రాను నే రాను
హ రాను గా జాతర రాను
రాను నేన్ ఆగం గాను
రాను గా జాతర నేను
రాను నేన్ ఆగం గాను
మల్లెపల్లిలా మల్లె తోటనే
నీ జడలా పూలు అల్లి పెడతనే
నల్లగొండలా నక్కిలీసులే
నీ మేడలా భలే మెరిసిపోతాయే
చాలు అయ్యా చాలు
చాలు నీ జూట మాటలు
చాలు నీ కుర్రకూతలు
చాలు నీ జూట మాటలు
చాలు నీ కుర్రకూతలు
రాయే రాయే పిల్ల
నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా
రాను రాను పొలగా
మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా
అందుకే రాను ఎహే రా నే రాను
హ రాను గా జాతర రాను
రాను నేన్ ఆగం గాను
రాను గా జాతర నేను
రాను నేన్ ఆగం గాను
పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంతా నీ కంటగడతనే
మా పాలమూరి పంచ వన్నేవే
పైస కట్నం నేనోళ్ళనంటినే
అయినా రాను నే రాను
రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు
నే రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు
రాయే రాయే పిల్ల
రచ్చమాని చచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా
కానీ కానీ పోలగా
కంచేదించి ప్రేమవంచి అడుగైతా నీ అడుగుల్లా
సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ
సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ
RANU BOMBAI KI RANU SONG DETAILS
రాము రాథోడ్ (Ramu Rathod) – లిఖిత (Likitha)
గాయకుడు: రాము రాథోడ్ (Ramu Rathod) – ప్రభ (Prabha)
లిరిక్స్ : రాము రాథోడ్ (Ramu Rathod)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan keys)
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ (Sekhar virus)
నిర్మాత: వాలి (Vali)